వినియోగ మరియు గోప్యతా నిబంధనలు


మాలో చాలామంది సహోదర సహోదరీలు కలిసి ఈ వెబ్ సైట్ లో ఉన్న విషయాలు వ్రాసారు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం మాకు చాల ముఖ్యమైన విషయం. మేము కలిసి బైబిల్ ధ్యానించినప్పుడు మాకు అర్థమైన విషయాలనే ఈ ఆర్టికల్స్ లో  వ్రాసాము. బైబిల్ లో సంఘం గురించి బోధించబడిన ప్రకారం మాలో సంఘ నాయకుడు అంటూ ఎవరు లేరు గాని మా విశ్వాసానికి మేమందరము కలిసి బాధ్యత తీసుకుంటాము.

మేము ఎవరమో ఎవరికీ తెలియకుండా ఉండాలనేది మా ఉద్దేశ్యం కాదు. ఎవరైతే యదార్ధమైన హృదయం కలిగి దేవుని కోసం వెతుకుతున్నారో అటువంటి వారిని కలుసుకోవాలనే  కోరికతో నే ఈ వెబ్ సైట్ ని చేసాము.

A symbol of the legal code covering a computer keyboard and a smart phone

వినియోగ నిబంధనలు

ఈ వెబ్సైట్ లో ఉన్న ఆర్టికల్స్ ను మీరు వ్యక్తిగతంగా చదువుకోడానికి మరియు కలిసి మాట్లాడుకోడానికి  వినియోగించవచ్చును. ప్రతి ఆర్టికల్ లోని ఆలోచనలు మరియు ముగింపులు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి.కాబట్టి, దేనిని అపార్ధం చేసుకోకుండా ఉండడానికి ప్రతి ఆర్టికల్ ను పూర్తిగా చదవమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

మా ఆర్టికల్స్ ను ప్రైవేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించడం

మీరు ఈ వెబ్‌సైట్‌లోని ఆర్టికల్స్ ను డౌన్‌లోడ్ చేసువచ్చు, సేవ్ చేయవచ్చు, ప్రింట్ చేయవచ్చు, కాపీ చేయవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు కానీ వీటికి ఎటువంటి మార్పులు చేయరాదు. వ్యక్తిగతంగా ఉపయోగించుకోవచ్చు గాని ఎటువంటి వ్యాపార ఉద్దేశ్యంతో ఉపయోగించరాదు. ఒకవేళ ఎవరికైనా ఇది పంపిణి చేయాలనుకుంటే దయచేసి ఈ లింక్ (https://www.te.christiansinindia.info/) ని కూడా వారికి తెలియచేయండి.

మా ఆర్టికల్స్ ను ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించడం

మేము అంగీకరించని ప్రయోజనాల కోసం ఈ వెబ్ సైట్ లోని విషయాలను అనుచితంగా ఉపయోగించకుండా నిరోధించడానికి, మీరు ఈ సైట్‌లోని ఏదైనా భాగాన్ని ప్రచురణ, ప్రజా ప్రసారం, ఉపన్యాసం లేదా మరొక వెబ్‌సైట్‌లో ఉపయోగించాలనుకుంటే మీ అనుమతి అభ్యర్థనను మాకు ఇమెయిల్ చేయమని మేము మిమ్మల్ని కోరుతున్నాము. మీరు మా ఇమెయిల్ చిరునామాను మమ్మల్ని సంప్రదించండి పేజీలో కనుగొనవచ్చు.

లింకులు

మా హోమ్‌పేజీకి లేదా మా వెబ్‌సైట్‌లోని ఏవైనా పేజీలకు లింక్ చేయకోవచ్చు.

మా వెబ్‌సైట్ లో కొన్ని ఇంటర్నెట్ లో ఉన్న బయట సైట్ల లింకులు ఇవ్వబడ్డాయి, ఆ సైట్లు థర్డ్ పార్టీల లేదా బయట వాళ్ళ చే నిర్వహించబడుతున్నవి కాబట్టి వాటిలో ఉన్న విషయాలకు మేము భాద్యత వహించము. ఆ లింకులను అందించడం ద్వారా, లింక్ చేయబడిన సైట్‌లలోని ఉన్న విషయాలన్నిటితో మేము తప్పనిసరిగా అంగీకరిస్తున్నామని కాదు.

వ్యక్తిగత గోప్యత

మీ గురించి ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని అందించకుండానే మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మేము మీ స్థాన సమాచారాన్ని రికార్డ్ చేయము, లేదా మరే ఇతర విధంగా మిమ్మల్ని ట్రాక్ చేయము. మేము మా వెబ్‌సైట్‌లో కుక్కీలను ఉపయోగించము.