జీవితంలో నిజమైన లక్ష్యం 

నేను ఎక్కడికి వెళ్తున్నానని నిన్ను నీవు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా ? జీవితంలో నీ లక్ష్యం ఏమిటి ? జీవితం అంటే అంతేనా అని ఎప్పుడైనా ఆలోచించావా ?

ఒక చిన్న బాబు ఆకాశం వైపు చూస్తున్నాడు.

ఈ రోజుల్లో చాలా మంది అమెరికా వెళ్లాలని, బాగా డబ్బులు సంపాదించి జీవితంలో స్థిరపడాలని, అందరు తమ గురించి గొప్పగా చెప్పుకోవాలని, మంచి ఉద్యోగాన్ని, మంచి వివాహాన్ని, మంచి ఆరోగ్యాన్ని మరియు మొదలగు ఇతర విషయాలను తమ జీవితంలో లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇటువంటివి  మన జీవితాలకు సంతృప్తిని ఇచ్చేవిగా కనిపించినప్పటికి అవి తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రమే ఇవ్వగలవు కాబట్టి మనం ఈ లోకానికి మించి జవాబు  కోసం వెతకాలి, అంటే దేవుడి కోసం వెతకాలి. దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మనకు ఏది మంచిదో ఆయనకు తెలుసు. ఆయన శాశ్వతమైనవాడు  కాబట్టి ఆయన మనకు ఎప్పటికి ఉండే ఆనందాన్ని ఇవ్వగలడు.

యేసుక్రీస్తు దీని గురించి ఏమి చెప్పారంటే

భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. (మత్తయి సువార్త 6:19–21)

ఈ విధంగా నీ  హృదయం తాత్కాలికమైన ఈ ధనం పైన ఉన్నట్లయితే నీవు త్వరగా నీ చదువుకి, ఉద్యోగానికి, సినిమాలకు మరియు ఇతర విషయాలకు బానిసగా అవుతావు. నీ సమయాన్ని శక్తిని కేవలం వీటి కోసం ఇచ్చి నీకున్న స్వేచ్ఛని కోల్పోయి మిగిలిన ఏ విషయాల గురించి ఆలోచించలేవు. కానీ ఆత్మీయ విషయాల గురించి ఆలోచించి యేసు ఇక్కడ చెప్పిన పరలోక ధనాన్ని నీవు సంపాదిస్తే అప్పుడు నిజమైన సంతోషాన్ని అనుభవించగలవు. అప్పుడు నీ జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటి అని అర్థం చేసుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు.

యేసుక్రీస్తు మనకు మార్గం చూపిస్తాడు

మనం సత్యాన్ని గ్రహించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి మన పట్ల తనకున్న ప్రేమను చూపించాడు. సత్యం అనేది సిద్ధాంతపరమైనది కాదు గాని మనిషి జీవితంలో ఉన్న ప్రతి పాపానికి గల కారణాల గురించి యేసుక్రీస్తు మాట్లాడి మన స్వార్థపూరిత జీవితం నుండి బయటపడే మార్గాన్ని మనకు చూపించాడు.

ఆయనకి ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుతమైనది. యేసు మాట్లాడటమే కాదుగాని ఎవరూ ఎన్నడూ జీవించని విధంగా నీతిగా, పవిత్రముగా తన జీవితాన్ని కూడా జీవించాడు. ఆయన మనల్ని తన మాదిరిని అనుసరించమని ఆహ్వానిస్తున్నాడు, అంటే మన సొంత  కోరికలు మరియు ప్రణాళికలను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్త్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించు కొనును.ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్య గలుగును? (మార్కు సువార్త 8:34–37)

మన  ప్రాణం కంటే ఇంకా విలువైనది మన  జీవితంలో  ఏది లేదు. కాబట్టి మన రక్షణకు ఆటంకం కలిగించే ఏ అడ్డంకినైనా తొలగించడానికి మనం ప్రతి విధమైన ప్రయత్నాన్ని చేయకూడదా? మన స్వార్థపూరిత ప్రణాళికలు మరియు కోరికలకు బదులుగా దేవుని కోసం జీవించాలనే కోరికతో మనం ఉండాలి. ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమకు ఈ విధంగా మనం ప్రతిస్పదించగలం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు మరియు ఎల్లప్పుడూ మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. మన జీవితాలను మార్చడం కష్టంగా అనిపించినా, మనం నిరాశ చెందడానికి ఎటువంటి కారణం లేదు ఎందుకంటే దేవుడు ప్రతి కష్టాన్ని అధిగమించడానికి మనకు తన శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు. యేసు మనకు బోధించడానికి మరియు పవిత్ర జీవితం కోసం మన ప్రయత్నాలలో ఒక గురువుగా మరియు సోదరుడిగా మనతో పాటు రావడానికి వచ్చాడు.

క్రైస్తవులు యేసును హృదయపూర్వకంగా అనుసరిస్తారు

క్రైస్తవ జీవితం అంటే యేసును హృదయపూర్వకంగా అనుసరించడం. మన జీవితంలో దేవుడికి  మొదటి స్థానాన్నిఇస్తేనే, మనం క్రైస్తవులు అని పిలువబడటానికి అర్హులం. మనం క్రైస్తవునిగా పుట్టి పెరిగాము కాబట్టి కొన్ని మతపరమైన సంప్రదాయాలు మరియు నియమాలను పాటిస్తూ ఏదో ఒక విధంగా మతపరమైన జీవితాన్ని గడపడం అనేది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్త ప్రకారం మన జీవితం లేకపోతే యేసును సొంత రక్షకుడిగా అంగీకరించడం కూడా వ్యర్థమే. ఈ విధంగా మన జీవితం లేకపోతే మనం పాటించే నియమాలు చేసే పనులు దేవుని ముందు కొన్ని క్రియలే కానీ యేసు చెప్పిన అనుభవాన్ని దేవునిలో మనం పొందలేము.

అందుకు యేసు వారితో ఇట్లనెను — ”జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.(యోహాను సువార్త 6:35)

మనం దేవుని నుంచి ఆశీర్వాదాలు ఆశించడానికి బదులుగా దేవునికి మన జీవితాలను హృదయపూర్వకంగా సమర్పించుకోవాలి.

చాలామంది దేవుని నుంచి చాల విషయాలు ఆశిస్తారు కానీ వాళ్ళ జీవితాలను పూర్తిగా దేవునికి ఇవ్వాలనుకోరు అనేది నిజం కాదా? మన జీవితాలను దేవునికి ఇవ్వకుండా అన్ని రకాల ఆశీర్వాదాలను ఆయన నుంచి పొందాలనుకుంటే మనం దేవునితో సంబంధం కలిగి ఉండగలమా?దేవుని నుంచి కేవలం పొందుకోవడం మాత్రమే కాదు కానీ ఆయనకి మన జీవితాన్ని ఇచ్చినప్పుడే ఆయనతో మనం బంధాన్ని కలిగి ఉండగలం. రోమాలో ఉన్న క్రైస్తవులకు అపొస్తులుడైన పౌలు ఈ విధంగా రాస్తున్నారు.

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.(రోమీయులకు వ్రాసిన పత్రిక 12:1)

క్రైస్తవులు కేవలం ప్రత్యేకమైన రోజుల్లో లేక ప్రత్యేకమైన స్థలాల్లో మాత్రమే కాదు గాని వారి జీవితాంతం దేవున్ని సేవిస్తారు. బైబిల్ లో కూడా క్రైస్తవులు ఎవరికి వారుగా కాదు కానీ అందరూ కలిసి దేవున్ని సేవించారు.ఈ రోజుల్లో మనం కూడా మొదటి క్రైస్తవుల యొక్క సహవాసాన్ని ఉదాహరణగా తీసుకొని వెంబడించాలి.

“నేను ఎక్కడికి వెళ్తున్నాను?” అనే ప్రశ్న “నేను ఎక్కడికి వెళ్ళాలి?” అనే ప్రశ్నకు దారితీయాలి. అపోస్తులుడైన పేతురు యేసుతో ఇలా చెప్పాడు

సీమోను పేతురు — ప్రభువా, ఎవనియొద్దకు వెళ్లుదుము ? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు. (యోహాను సువార్త 6:68)