“మీరు ఒకని యెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను” 

(యోహాను 13:35)

క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఎలాగైతే పూర్ణహృదయముతో యేసుక్రీస్తును ప్రేమించారో మేము కూడా అలాగే యేసుక్రీస్తును ప్రేమించాలని ఆయన చెప్పిన వాటన్నిటికీ లోబడి సహోదర ప్రేమ కలిగి జీవించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాము.

సహోదర ప్రేమ కలిగి దేవునిలో జీవిస్తూ ప్రతి రోజూ మేము ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు  మేము అర్థం చేసుకున్న విషయాలే  ఈ వెబ్ సైటులో ఆర్టికల్స్ గా  వ్రాసాము.

మా ఆర్టికల్స్

నేను ఎక్కడికి వెళ్తున్నానని నిన్ను నీవు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా ? జీవితంలో నీ లక్ష్యం ఏమిటి ? జీవితం అంటే అంతేనా అని ఎప్పుడైనా ఆలోచించావా ?

ఈ రోజుల్లో చాలా మంది అమెరికా వెళ్లాలని, బాగా డబ్బులు సంపాదించి జీవితంలో స్థిరపడాలని, అందరు తమ గురించి గొప్పగా చెప్పుకోవాలని, మంచి ఉద్యోగాన్ని, మంచి వివాహాన్ని, మంచి ఆరోగ్యాన్ని మరియు మొదలగు ఇతర విషయాలను తమ జీవితంలో లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇటువంటివి  మన జీవితాలకు సంతృప్తిని ఇచ్చేవిగా కనిపించినప్పటికి అవి తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రమే ఇవ్వగలవు కాబట్టి మనం ఈ లోకానికి మించి జవాబు  కోసం వెతకాలి, అంటే దేవుడి కోసం వెతకాలి. దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మనకు ఏది మంచిదో ఆయనకు తెలుసు. ఆయన శాశ్వతమైనవాడు  కాబట్టి ఆయన మనకు ఎప్పటికి ఉండే ఆనందాన్ని ఇవ్వగలడు.

యేసుక్రీస్తు దీని గురించి ఏమి చెప్పారంటే

భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. (మత్తయి సువార్త  6:19–21)